రైతు భరోసా నిధులు సోమవారం విడుదల కానున్నాయి.రాయలసీమ జిల్లాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయానికి 17.25 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లా, శ్రీ బాలాజి, చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాలకు సంబంధించి 17,25,580 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఖరీఫ్‌లో మొదటి విడతగా రైతు భరోసా నిధులు రూ.5,500, పీఎం కిసాన పథకం నిధులు కలిపి మొత్తం రూ.7,500 ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. సోమవారం సీఎం జగన మోహన రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో ప్రారంభిస్తారని, ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లతోపాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లాలో 2,67,987 మంది రైతులకు రూ.147,39,28,000, నంద్యాల జిల్లాలో 2.93 లక్షల మంది రైతులకు రూ.115 కోట్లు జమ చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ పథకం ప్రారంభానికి ఒక్కో జిల్లాకు రూ.1.25 లక్షలు కేటాయించామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నిధులతో జిల్లా అధికార యంత్రాంగం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వివరించాలని ఆయన ఆదేశించారు.
Know the Status of YSR Riathu Barosa Scheme
Praja Sadhikara Survey (ప్రజా సాధికార సర్వే)
▪రైతు భరోసా ఈ పథకంలో లబ్ధి దారులు కావాలంటే ప్రజా సాధికార సర్వే లో పేర్లు ఉండాలి
▪ మీ ఆధార్ నెంబర్ తో మీ సర్వే పూర్తి అయిందో లేదో తెలుసుకోండి
Know the Status Praja Sadhikara Survey
0 comments:
Post a Comment