సేవింగ్స్ అకౌంట్లలో కొంత మొత్తాన్ని కలిగి ఉండాలి. లేదంటే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులు ఈ విషయాన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. కస్టమర్లు వారి సేవింగ్స్ అకౌంట్లలో కొంత మొత్తాన్ని కలిగి ఉండాలి.
లేదంటే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.


బ్రాంచుల ప్రాతిపదికన మినిమమ్ బ్యాలెన్స్ మారుతుంది.

మెట్రో, సెమీ అర్బన్ పట్టణాల్లోని బ్రాంచుల్లో


 అకౌంట్ కలిగిన కస్టమర్లకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000గా ఉంది.
కస్టమర్లు వారి అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే కచ్చితంగా చార్జీలు చెల్లించాల్సిందే.
అయితే ఎస్‌బీఐ ఇటీవల అర్బన్ బ్యాంచుల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (ఏఎంబీ) పరిమితిలో కోత విధించింది. రూ.5,000 నుంచి రూ.3,000 తగ్గించింది. సవరించిన నిబంధనల వల్ల ఎస్‌బీఐ ఖాతాదారులు వారి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.3,000 కలిగి లేకపోతే చార్జీలు పడతాయి.
రూ.1,500 కలిటి ఉంటే రూ.10తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. అదే మినిమమ్ బ్యాలెన్స్‌లో 75 శాతానికి పైగా తక్కువ మొత్తాన్ని కలిగి ఉంటే అప్పుడు రూ.15తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. అయితే ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ అనేవి శాలరీ అకౌంట్ కలిగిన వారికి వర్తించవు. అంతేకాకుండా స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్, జన్ ధన్ అకౌంట్లకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలతో పనిలేదు.

మిగతా సేవింగ్స్ అకౌంట్లకు 

మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయి. అందుకే అకౌంట్లలో సరిపడ డబ్బులు ఉండేలా చూసుకోండి.అంతేకాకుండా రూ.25,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కలినగిన కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రెండు క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ను ఉచితంగా పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.50,000 మధ్యలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు నెలకు పది క్యాష్ విత్‌డ్రాయెల్స్ ఉచితంగా వస్తాయి. ఇక రూ.లక్షకుపైగా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై పరిమితి అంటూ ఏమీ ఉండదు. రూ.50,000 నుంచి రూ.లక్ష మధ్యలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు 15 క్యాష్ విత్‌డ్రాయెల్స్ పొందొచ్చు. ఉచిత పరిమితిని దాటితే అప్పుడు రూ.50తోపాటు జీఎస్‌టీని పెనాల్టీని చెల్లించాలి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top