మనం ప్రతినెల మన మండల విద్యాశాఖ అధికారులకు నెలవారి MDM రిపోర్టు సమర్పించవలసి ఉంటుంది. ఈ రిపోర్టు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కానీ మన MDM website నందు మనం ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులకు MDM అందించామో వాటి వివరాల తో కూడిన రిపోర్టు అందుబాటులో ఉంటుంది ఆ సైట్ నుండి సులభంగా మనం డౌన్లోడ్ చేసుకుని అదే కాపీని ప్రింట్ తీసి మండల విద్యాశాఖ అధికారులకు అందిస్తే మనకి సమయం చాలా ఆదా అవుతుంది కావున అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ వివరించడం జరిగింది.
డౌన్లోడ్ చేసే విధానం:
- బిల్లు సంవత్సరం ఎంపిక చేసుకోవాలి
- ఏ నెల బిల్లు మనకి కావాలో ఆ నెల బిల్లు ని ఎంపిక చేసుకోవాలి
- మన పాఠశాల కు చెందిన UDISE code ఎంటర్ చేయాలి
- Get Details Button క్లిక్ చేయాలి
ఈ విధంగా చేస్తే మన నెలవారీ రిపోర్టు మనకి డౌన్లోడ్ అవుతుంది ఇదే మన మండల విద్యాశాఖ అధికారులకు సమర్పించుకోవచ్చు క్రింద HM సంతకం , క్లాస్ టీచర్ సంతకం కూడా ఇవ్వడం జరిగింది.
Downloaded MDM Monthly Report
0 comments:
Post a Comment