వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌

ప్రముఖ మెసేంజర్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా...లేదా వాడకుండా  ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది.

యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్‌ రిగక్నైజేషన్‌ లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా..టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్‌ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది.

ఈ ఫీచర్ ఎలా ఆక్టివేట్‌ చేయాలంటే..


*ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

*సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయాలి.

*ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*యూస్‌ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్‌ అప్షన్‌పై ప్రెస్ చేయాలి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top