AP Grama Volunteer Job Chart AP Govt Released Grama Volunteer Notification their Job Chart and Duties
వాలంటీర్ల విధులు
- కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం.
- తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పని చేయాలి. ఇందుకోసం తరచుగా గ్రామ, వార్డు సచివాలయంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
- లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర. వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించాలి.
- ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలి.
- గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే మీటింగ్‌లకు హజరు కావాలి. తన పరిధిలో ప్రజానీకం సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి.
- లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరుచుకోవాలి.
- విద్య, ఆరోగ్య పరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.
- రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీరు వంటి అంశాలు పరిశీలించాలి.
0 comments:
Post a Comment