Postal Ballot complete information

 ఎన్నికల విధుల్లో ఉన్న వారి కోసం ఫారం-12


★ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఫారమ్‌-12 ప్రవేశపెట్టింది.

★ దీనిని పూర్తి చేసి అధికారులకు అందజేస్తే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ ముందురోజున వారికి పోస్టల్‌ బ్యాలట్‌ అందజేస్తారు.

★ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తపాలశాఖ ద్వారా వీటిని పంపించవచ్చు లేదా ఉద్యోగులు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించే రోజున ఉదయం ఎనిమిది గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌లు తీసుకునే అవకాశం ఉంది.

★ ఇందుకోసం కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఒక బ్యాక్స్‌ ఏర్పాటు చేస్తారు.

★ అటు పోస్టల్‌ అధికారులకు తపాలా ద్వారా వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లను వెంటనే తీసుకువచ్చి వేయాల్సిందిగా ముందుగానే ఆదేశాలు జారీ చేస్తారు.

★ ఎనిమిది గంటలు దాటిన తరువాత వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌లను పరిగణనలోకి తీసుకోరు.

★ ఒక్క ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రమే ఎన్నికల కమిషన్‌ ఈ అవకాశం కల్పించింది.

★ ప్రతి ఒక్కరూ ముందుగానే ఫారమ్‌-12 పూర్తి చేసి అందజేసే ఎన్నికల ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top