MLC Election Notification

*ఎన్నికల షెడ్యుల్‌ విడుదల*

*న్యూఢిల్లీ:*
 ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైంది. ఏపీలోని తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడులైంది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లో మార్చి 22న ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 26న ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

Download Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top