ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2019 – 20 విద్యా సంవత్సరములో
6 వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన
నోటిఫికేషన్ తేది: 05-01-2019
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2019–20 విద్యా సంవత్సరమునకు ‘6 ‘ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 31.03.2019 ( ఆదివారము ) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 31.03.2019 న ఉ. 9-00 గం. ల నుండి ఉ. 11-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
ప్రవేశ అర్హతలు : -
- వయస్సు: ఒ.సి., బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2007 మరియ 31–08-2009 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC,ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2005 మరియు 31–08 –2009 మధ్య పుట్టి ఉండాలి.
- సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2017-18మరియు 2018-19 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2018-19 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
- దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడగలరు.
4) పరీక్షా రుసుము : OC మరియు BC లకు : రూ. 100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)
SC మరియు ST లకు : రూ. 30/- (అక్షరాల 30/- రూపాయలు మాత్రమే)
5) 6‘ వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షలో OC మరియు BC విద్యార్ధులు 40 మార్కులు SC మరియు ST విద్యార్ధులు కనీసం 35 మార్కులు పొందియుండవలెను.
6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
7) ప్రవేశ పరీక్షా ప్రశ్నాపత్రము Object Type లో వుండును.
ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.
Sd/- K.సంధ్యారాణి, I.Po.S.
పాఠశాల విద్యా కమీషనరు మరియు ఎక్స్ అఫిషియో పి.డి. ఆం.ప్ర. ఆదర్శ పాఠశాలలు, ఇబ్రహీంపట్నం,అమరావతి.
0 comments:
Post a Comment