Aadhaar Reprint - How to Get Aadhaar Reprint

ఆధార్ కార్డు లో  ఎటువంటి మార్పులుచేర్పులు చేసినా.. కొద్ది రోజుల తర్వాత మీసేవా కేంద్రాలకో, ఆధార్‌ కేంద్రాలకో వెళ్లి మనమే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఇవి కొంత నాసిరకంగా, మునుపటి వాటితో పోల్చితే చాలా పల్చగా ఉంటాయి. అయితే ఇక నుంచి ఆధార్‌ ‘ఒరిజినల్‌’ కార్డులను నేరుగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నుంచే పొందవచ్చు. ఆధార్‌కార్డు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పోస్టులో ఇంటికి పెద్ద కార్డులు వచ్చేవి. గుర్తుంది కదా! ఇప్పుడూ అలానే వస్తాయన్నమాట. పైలట్‌ ప్రాజెక్టుగా యూఐడీఏఐ దీనిని మళ్లీ చేపట్టింది. ఆధార్‌ కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో తీసుకున్న కార్డులుచెల్లుబాటు అయినా.. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారు .  

 ఎలా దరఖాస్తు చేయాలంటే..

1.Click on Aadhar Reprint website https://resident.uidai.gov.in/aadhaar-reprint
2.వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత అక్షరాలు, అంకెలు గల సెక్యూరిటీ కోడ్‌(కేప్చా)ను ఎంటర్‌ చేయాలి.

4.టీవోటీపీ లేకపోతే ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
 5.ఆధార్‌తో రిజిస్టర్‌ అయిన నంబరుకు వచ్చిన ఓటీపీని సంబంధిత బాక్సులో ఎంటర్‌ చేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
6.తర్వాత రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును మీ అడ్రస్‌కు యూఐడీఏఐ పోస్టులో పంపుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top