రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు -పెన్షనర్లు అందరికి సంవత్సరానికి ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖా జిఓ ఆర్ టి :492 తేదీ:27-09-2018 న జారీ చేసినది దీని ప్రకారం:
ఉద్యోగులు , పెన్షనర్లు -ఆరోగ్య పరీక్షలు ( Master Health Checkup):
- తొలుత ఉద్యోగులు , పెన్షనర్ల కు వారి జీవిత భాగస్వాములకు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు
- దీని కోసం అయ్యే ఖర్చు మొత్తం రూ 4700/- ఉద్యోగులు /పెన్షనర్లు , ప్రభుత్వం చేరి సగం భరించాలి
- 40 సంవత్సరాలు దాటినా వారందరు హెల్త్ చెక్అప్ చేయించుకోవచ్చు
- పరీక్షలు చేయించుకున్న తేదీ నుండి 12 నెలల తరవాత మలి విడత ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తరవాత ప్రతి సంవత్సరం వైద్యప4రీక్షలు చేయించుకోవచ్చు
- ఆరోగ్య పరీక్షలు నివేదికలు ఆన్లైన్ లో ఉద్యోగులు చూసుకునేందుకు డిజిటల్ లాకర్ సౌకర్యం కల్పిస్తారు
- ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఏరియా ఆస్పత్రులలో బోధనాసుపత్రులలో పాటు ట్రస్ట్ కు అనుబంధముగా ఉన్న 400 ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది
- ప్రాధమికంగా ను మరియు తర్వాత చేసే టెస్ట్ లు జాబితా ఈ క్రింది GO No:492 ద్వారా పొందవచ్చు
0 comments:
Post a Comment