ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూఅదార్ కార్డు లను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి పొందే అవకాశం రెవిన్యూశాఖశాఖ అందుబాటులోకి తీసుకువచ్చినది మన సర్వే నెంబర్ ఆధారం గా 11 అంకెల విశిష్ట సంఖ్య తో తాత్కాలిక అదార్ కార్డు లను పొందే అవకాశం ఉన్నది
Bhooseva -Bhooaadhar -Know Your Bhooaadhar Number-Download Bhooadhar
భూధార్అంటే ఏమిటి ?
జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.భూధార్ ఎలా కేటాయించును?
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు' కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు - సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును.భూధార్ ప్రయోజనాలు :
- భూమి యొక్క స్థితి నిర్ధారణ.
- సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు సమర్పించాల్సిన అవసరం లేదు.
- భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు.
- భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును. .
- ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట.
- సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు.
- సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.
భూధార్ యొక్క లక్షణాలు ఏమిటి ?
- అన్ని రకాల సర్వే వ్యవస్థలకు ఒకే సాఫ్ట్ వేర్.
- భూధార్ ద్వారా రికార్డులోని సమాచారాన్ని భూమి పైగల వాస్తవిక సమాచారం కలిగిన పటములకు అనుసంధానం చేసుకోవచ్చును.
- ఇది సర్వే సబ్ డివిజన్ వంటి రోజువారీ లావాదేవీలకు నేరుగా చేయుటకు వీలు కల్పిస్తుంది.
- ఇది మ్యాప్లను వీక్షించడానికి మరియు ముద్రించడానికి సేవలు అందిస్తుంది.
- డేటాబేస్ విధానం: ఎప్పుడైనా / ఎక్కడైనా అందుబాటులో ఉండే భూపటములు (Maps).
- ప్లాట్ఫారమ్ స్వతంత్రత : ఇది Windows / Linux లో పనిచేయడానికి మద్దతు ఇస్తుంది.
మీ భూధార్ నెంబర్ ఎలా తెలుసుకుంటారు :
1.మీ భూధార్ తెలుసుకోవాలంటే పోర్టల్ లో మీ భూమి 4 రకాలలో ఈ క్రింద చూపిన విధముగా దేనికి చెందినఃదో తెలుసుకోవాలి వాటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలి
2.మీ జిల్లా ఎంపిక చేసుకోవాలి , మీ మండలం ఎంపిక చేసుకోవాలి , తరవాత మీ గ్రామము ఎంపిక చేసుకోవాలి
3.మీకు మీకు కేటాయించిన భూఆదర్ మీకు కేటాయించిన భూఆదర్ Download కూడా చేసుకోవచ్చు
భూ ఆధార్ నెంబర్ తెలుసు కోవాలంటే మీ సర్వే నెంబర్ తెలిసి ఉండాలి మీ సర్వే నెంబర్ తెలియక పోతే ఈ క్రింద లింక్ ద్వారా మీ సర్వే నెంబర్ తెల్సుసుకోండి
0 comments:
Post a Comment