ఉమ్మడి ఆంధ్రవప్రదేశ్ రాష్ట్రంలో 1.9.2004 తేది నుండి ఉద్యోగములో చేరిన నూతన పెన్షన్ పథకం(NPS) G.O.Ms.No.653 తేది:22.9.2004 ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో ఉన్నవారికి AP Revised Pension Rules-1980 వర్తించవు, అలాగే APGPF Rules-1935 కూడా వర్తించవు. వీరి జీతములో ప్రతినెలా బేసిక్ పే + డి.ఏ లో 10% చందా రూపంలో చెల్లించాలి. దీనికి సమానంగా ప్రభుత్వ వాటా ఈ పథకం లోని చందాదారుల ఖాతాలలో జమచేయటం జరుగుతుంది.
- రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms.No.62 Fin తేది:7.3.2014 ద్వారా NPS పథకంలోని చందాదారులకు తమ ఖాతాలోని మొత్తాలను ఎలా ఉపసంహరించుకోవాలో తెలపడం జరిగింది. పై జీవో లో రెండు అనెగ్జర్లు పొందుపరచడం జరిగింది
- అనెగ్జర్-I: NPS పథకం లోని ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన విధివిధానాలు.
- అనెగ్జర్-II: NPS పథకం లోని ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవడానికి దరఖాస్తు C.R.A కు ఎలా సమర్పించాలి.
- ప్రస్తుతం విధివిధానాలు ప్రకారం ఈ క్రింద తెలిపిన 3 సందర్భాలలో NPS ఖాతాలలో జమ అయిన మొత్తాలను ఉపసంహరించుకోవచ్చు.
II: ఉద్యోగము చేస్తూ మరణించినప్పుడు.
III: వివిధ కారణాల కారణంగా, సూపరాన్యుయేషన్ తేదీ కంటే ముందే పదవీ విరమణ పొందినపుడు.
సూపరాన్యుయేషన్ తేదీన రిటైర్మెంటు అయినవారు:
(i) దరఖాస్తు ఫారం 101 GS(iI) నామినేషన్ సమాచారం ఆనెగ్జర్
(iii) ఒక్కరే నామీనిగా ఉంటే 101 GS
(iv) ఒకరికన్నా ఎక్కువ మంది నామీనిగా ఉంటే 101 GS-N1
- అతని ఖాతాలలో నిల్వ ఉన్న మొత్తాలలో 40% పెన్షన్ ఫండ్ యాన్యుటి బాండ్లు కొనడానికి వెచ్చిస్తారు.
- PFRDA ఎంపికచేసిన ఏ సంస్థనైనా ఎంపిక చేసిన చేసుకోవచ్చును.
- దీనిపై వచ్చిన ఆదాయమునే నెలనెలా పెన్షన్ చెల్లిస్తారు.
- మిగిలిన 60% మొత్తము చందాదారునికి చెల్లిస్తారు లేక చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు.
- పై 60% లో తిరిగి 40% మొత్తము 70 సంవత్సరాల వరకు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టుటకు అవకాశం కలదు. 70 సంవత్సరాలు పూర్తయిన వెంటనే జమలు చందాదారుని బ్యాంక్ అకౌంట్లో జమచేస్తారు. పెట్టుబడి పెట్టిన మొత్తాలను చందాదారులు ఎప్పుడైనా విరమించుకోవచ్చు.
ఉద్యోగం చేస్తూ చనిపోతే:
(i) దరఖాస్తు ఫారం 103 GD- NPS ఖాతాలో నిల్వయున్న మొత్తము 100% అతని వారసులకు చెల్లిస్తారు.
- వివిధ కారణాల కారణంగా, సూపరాన్యుయేషన్ తేదీ కంటే ముందే పదవీ విరమణ పొందినపుడు
(i) దరఖాస్తు ఫారం 102 GP
(iI) నామినేషన్ సమాచారం ఆనెగ్జర్
(iii) ఒకరికన్నా ఎక్కువ మంది నామీనిగా ఉంటే 401 AS
- అతని ఖాతాలలో నిల్వ ఉన్న మొత్తాలలో 80% పెన్షన్ ఫండ్ యాన్యుటి బాండ్లు కొనడానికి వెచ్చిస్తారు.
- PFRDA ఎంపికచేసిన ఏ సంస్థనైనా ఎంపిక చేసిన చేసుకోవచ్చును.
- దీనిపై వచ్చిన ఆదాయమునే నెలనెలా పెన్షన్ చెల్లిస్తారు.
- మిగిలిన 20% మొత్తము చందాదారునికి చెల్లిస్తారు లేక చందాదారుడు ఎంపిక చేసుకున్న వివిధ చెల్లింపు పథకాల ద్వారా చెల్లిస్తారు.
- పై మొత్తంలో 20% 70 సంవత్సరాల వరకు పెన్షన్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టుటకు అవకాశం కలదు. 70 సంవత్సరాలు పూర్తయిన వెంటనే జమలు చందాదారుని బ్యాంక్ అకౌంట్లో జమచేస్తారు. పెట్టుబడి పెట్టిన మొత్తాలను చందాదారులు ఎప్పుడైనా విరమించుకోవచ్చు.
యాన్యుటి బాండులు కొనుగోలు చేయడానికి PFRDA ఈ క్రింది సంస్థలను ఎంపిక చేయడం జరిగింది.
- LIC ఇండియా
- SBI లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్
- ICICI ఫ్రూడెన్షియల్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్
- HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్బ
- జాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్
- రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్స్టా
- ర్ ఇన్సూరెన్స్ డై-ఇచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ కో-లిమిటెడ్.
0 comments:
Post a Comment