G.O.No:132 Sanction of Child Care Leave for two months

మహిళాఉద్యోగులు, టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు. 'మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో.209 తేది:21-11-2016 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. 60 రోజుల సీసీయల్ ను మూడు విడతలుగా మంజూరుచేయాలి.180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.
AP child care leave rules child care leave application child care leave rules latest Guidelines  child care leave latest order 2020 child care leave rules in Telugu  child care leave rules in telugu child care leave latest order 2021 child care leave form AP Child Care Application

AP 60 Days Child Care Leave to AP Women Employees 

                 వివరణ:

ఇక్కడ 60రోజులను మూడు విడుతలు తగ్గకుండా అంటే ప్రతి విడత 20 రోజులే తీసుకోవాలని కాదు అని గమనించవలెను.
  1. 58+1+1(min 3times)✔
  2. 57+1+1+1(above 3times)
  3. 59+1(below 3times)✖
  4. 30+30(below 3times)✖
  5. 1+1+1.......60సార్లు(above 3times means here followed min 3times)✔
  6. కనీసం మూడు సార్లకు తగ్గకుండా (compulsory), గరిష్టంగా 60 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు(optional)
  7.  గరిష్టంగా ఎన్నిసార్లు ఉపయోగించుకోవాలో ఉపాధ్యాయురాలి ఐచ్ఛికం.
  8.  childcare leave ఒక్కరోజు కూడా పెట్టవచ్చు.
  9. ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.
  10. 40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
  11. ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
  12. మహిళా ఉద్యోగుల,టీచర్ల  పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.
  13. పిల్లల పరీక్షలు, అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.
  14. కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.
  15. శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు. మంజూరు సమయంలో ఏ రకమైన సర్టిఫికెట్లు జతపరచవలసిన అవసరంలేదు
  16. ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.
  17. ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
  18. శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
  19. ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.
  20. రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు.              

G.O.No:132 Sanction of Child Care Leave for two months

Download
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top